»Dubai Building Fire Accident Several Indians Dead
Dubai : దుబాయ్లో అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది మృతి
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 16 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన నలుగురు భారతీయులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు.
Dubai : దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 16 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. అల్ రస్(All rush) ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఇద్దరు కేరళ(Kerala)కు చెందిన వారున్నారు. చనిపోయిన ఇద్దరు దంపతులే. అంతే కాకుండా మిగతా ఇద్దరు భారతీయులలో తమిళనాడు(Tamilnadu)కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. వీరంతా ఓ భవనంలో పనిచేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు బిల్డింగ్ ఫోర్త్ ప్లోర్(Fourth floor) లో మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్(Control room) కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి మధ్యాహ్నం 2.42 గంటలకు మంటలను ఆర్పారు. ప్రమాదానికి కారణం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అని అధికారులు భావిస్తున్నారు. నసీర్ వాటనపల్లి అనే భారతీయ సామాజిక కార్యకర్త.. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారు కుటుంబ సభ్యులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్ పోలీసులు, భారత రాయబారి కార్యాలయం, స్నేహితులతో సమన్వయం చేసుకుంటూ.. వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ప్రమాద ఘటన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.