»Colombia Introduces Worlds First Junk Food Law To Prevent Lifestyle Diseases
Junk Food Law: జంక్ ఫుడ్ చట్టం తెచ్చిన మొట్టమొదటి దేశం!
మీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమా అయితే ఒక్కసారి ఈ వార్త చదవండి. ఎందుకంటే ఇటివల ఓ దేశం ఏకంగా జంక్ ఫుడ్ పై పన్నును విధిస్తోంది. అయితే అక్కడి ప్రజలు ఎక్కువగా జంక్ ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Colombia Introduces World's First Junk Food Law To Prevent Lifestyle Diseases
ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ ఎక్కువగా జంక్ ఫుడ్(Junk Food Law) కారణం అని చెప్పొచ్చు. కానీ ఈ జంక్ ఫుడ్ ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఇష్టంగా తినేస్తున్నారు. ఈ ఫుడ్ కి బానిసలుగా మారిపోయారని చెప్పొచ్చు. కానీ అదే జంక్ ఫుడ్ చాలా రకాల సమస్యలకు కారణమౌతుందని చెప్పొచ్చు. ఈ ఫుడ్ తినకూడదని ఎంత మంది నిపుణులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం వినడం లేదు. ఆ ఫుడ్ నే తింటున్నారు. ఈ క్రమంలో ఈ ఫుడ్ ని తినకుండా ఉండేలా ఓ దేశ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చింది.
దేశంలో జీవనశైలి వ్యాధులను అధిగమించే ప్రయత్నంలో భాగంగా కొలంబియా(Colombia) ఇటీవల అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై పన్ను విధించే కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీనిని ‘జంక్ ఫుడ్ చట్టం’గా సూచిస్తూ ఈ కొత్త బిల్లు ప్రపంచంలోనే మొట్టమొదటిదని తెలిపింది. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల లైఫ్ స్టైల్ సంబంధిత సమస్యలు వస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు ఈ చట్టం తీసుకువస్తున్నట్లు ఈ ప్రభుత్వం చెప్పడం విశేషం.
ఒక నివేదిక ప్రకారం రీసెంట్ గా కొలంబియా “జంక్ ఫుడ్ చట్టం” ఇటీవలే అమల్లోకి తీసుకు వచ్చింది. “ప్రభావిత ఆహారాలపై(foods) అదనపు పన్ను వెంటనే 10% నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది 15%కి పెరుగుతుంది. 2025లో 20%కి చేరుకుంటుంది” అని నివేదిక తెలిపింది. వెబ్సైట్, హెల్త్ పాలసీ వాచ్ ప్రకారం సాసేజ్లు, తృణధాన్యాలు, జెల్లీలు, జామ్‌లు, ప్యూరీలు, సాస్‌లు, మసాలాలు, మసాలాలతో సహా అధిక జోడించిన చక్కెరలు, ఉప్పు , సంతృప్త కొవ్వులతో కూడిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్లు పన్నులను(taxes) ఎదుర్కొంటున్నాయి.
ఒక సగటు కొలంబియన్ రోజుకు 12 గ్రాముల ఉప్పును(salt) వినియోగిస్తున్నాడని నివేదికలు చెబుతున్నాయి. ఇది లాటిన్ అమెరికాలో అత్యధికంగా, అంతేకాదు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. సోడియం అధిక వినియోగం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మరిన్ని వివిధ ఆరోగ్య సమస్యలకు కారణముతున్నాయి. వాస్తవానికి కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం, అనారోగ్యకరమైన రిటైల్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భధారణ వయస్సులో పెద్ద శిశువుకు ప్రసవించే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు.