»A Huge Explosion In Dhaka Killed 14 People And Injured More Than 100 People
explosion : ఢాకా లో భారీపేలుడు 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ (Bangladesh) పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో సమయంలో పేలుడు(explosion) సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఎనిమిది మంది మరణించారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు.
బంగ్లాదేశ్ (Bangladesh) పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో సమయంలో పేలుడు(explosion) సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఎనిమిది మంది మరణించారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. పేలుడు ప్రభావంతో బిల్డింగులోని ఇతర ఫ్లోర్లలో ఉన్న వాళ్లు కూడా గాయపడ్డారు. బిల్డింగ్ చాలా వరకు ధ్వంసమైంది. పేలుడు సమయంలో బిల్డింగ్ దగ్గరలో ఆగి ఉన్న ఒక బస్సుతోపాటు రోడ్డు కూడా ధ్వంసమైంది. ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఘటన సమచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు, సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల్ని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో (In the hospital)చేర్చి, చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఇప్పటివరకు పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదని స్థానిక మీడియా తెలిపింది. (BRAC) బ్యాంక్లో కొంత భాగం దానికి సమీపంలోని నిర్మాణంలో ఉందని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. పేలుడు ధాటికి కర్టెన్లు చీలిపోయి బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. రోడ్డుకు అవతలి వైపు ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది. అగ్నిమాపక శాఖ (Fire Dept) డిప్యూటీ డైరెక్టర్ దీన్ మోని శర్మ మాట్లాడుతూ… సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. స్థానిక ప్రభుత్వ అధికారి షాహదత్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆరు మృతదేహాలను సైట్ నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ (Skew operation) కొనసాగుతోందన్నారు. ప్రత్యక్ష సాక్షి నయ్హనుల్ బారీ అనే పోలీసు అధికారి (Police officer) ఇచ్చిన సమాచారం ప్రకారం పేలుడు సమయంలో రెండు కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించింది. గతేడాది జూన్లో ఈ ప్రాంతంలోని కంటైనర్ డిపోలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందగా దాదాపు 200 మంది గాయపడ్డారు.