»10 Days Old Infant And His Mother Rescued In Turkey
10 days infant:శిథిలాల కింద తల్లితో సహా 10 రోజుల పసికందు
టర్కీ (turkey), సిరియా (syria), భూకంప (earth queake) మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య (death toll) 25 వేలు దాటింది.
10 days infant:టర్కీ (turkey), సిరియా (syria), భూకంప (earth queake) మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య (death toll) 25 వేలు దాటింది. ఈ శతాబ్దంలోనే పెద్ద విపత్తు అని అధికారులు చెబుతున్నారు. భూ ప్రకంపనాలు వచ్చి100 గంటలు (100 hours) దాటినా మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. టర్కీ, సిరియా సహాయక చర్యల్లో ఇండోనేషియా (indonesia) పాల్గొంది. సహాయక బృందాలను పంపించింది. క్యూబా (cuba) కూడా ఆరోగ్య కార్యకర్తలను (health workers) టర్కీ, సిరియాకు తరలించింది. భూకంపంతో వేలాది మంది నివాస గృహాలు (homes) కోల్పోయారు. ఆ రెండు దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.
చిన్నారులు సేఫ్
టర్కీలో కూలిన బిల్డింగ్ శిథిలాల కింది నుంచి చిన్నారులు (children) మృత్యుంజయులు అవుతున్నారు. రోజుల పసికందు నుంచి పన్నెండేళ్ల పిల్లలను రెస్క్యూ బృందాలు (rescue teams) కాపాడుతున్నాయి. హతయ్ ప్రావిన్సులో ఓ బిల్డింగ్ శిథిలాల కింద నుంచి తల్లితో సహా పది రోజుల పసికందును (infant) రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద చిక్కిన 90 గంటలకు (90 hours) వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి పిల్లాడి ఏడుపు (cry) వినిపించడంతో అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ పసికందు వద్దకు చేరుకున్నారు. బాబుతోపాటు తల్లిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. నాలుగు రోజులు (four days) చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాబు చురుగ్గా ఉన్నప్పటికీ తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయారని వైద్యులు తెలిపారు.
విధ్వంసం
టర్కీ, సిరియాలలో ఈ నెల 6వ తేదీన పెను భూకంపం (earth quake) వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల్లో భారీ విధ్వంసం జరిగింది. ప్రాణ నష్టం రోజు రోజుకు పెరుగుతుంది. టర్కీ, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 25 వేలు దాటిందని, శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకుపోయారని అధికారులు వివరించారు. చనిపోయిన (death) వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. భూకంపం కారణంగా ఇల్లు, వాకిలి కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు.
ఆటంకం
టర్కీ(turkey), సిరియాలో (syria) భూకంపం (earth quake) విధ్వంసం సృష్టించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టం గురించి అయితే చెప్పక్కర్లేదు. శతాబ్దంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు ఇదీ అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పేర్కొన్నాడు. విమానాశ్రయాలు (airports), నౌకాశ్రయాలు (ports) దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సాయం టర్కీ, సిరియాలకు చేరడం కష్టంగా మారింది. ఆ తర్వాత 24 దేశాలకు (24 countries) చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారత సైన్యం, (indian army), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (ndrf teams) రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.