»Your Health Is Safe If You Eat These On A Regular Basis
Health Tips: పరగడుపున ఇవి తింటే మీ ఆరోగ్యం సేఫ్
ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అనారోగ్య సమస్య(Health Problems) లను కొని తెచ్చుకుంటున్నారు. మన జీవన శైలిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. రోజూ పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్(Healthy Food) తినడం అలవాటు చేసుకోవాలి.
ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అనారోగ్య సమస్య(Health Problems) లను కొని తెచ్చుకుంటున్నారు. మన జీవన శైలిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. రోజూ పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్(Healthy Food) తినడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
చాలా మందికి ఉదయం లేచిన వెంటనే ఏది పడితే అది తింటున్నారు. వివిధ రకాల పదార్థాలు తినడం వల్ల ఆ ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతోంది. కొందరైతే ఉదయం లేచినప్పటి నుంచి చాలా సేపటి వరకూ ఏం తినకుండా ఉంటారు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ లేచిన వెంటనే ఏం తినాలి, ఏ పదార్థాలు తినకూడదు వంటి విషయాలను తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. ఉదయం పరగడుపున కొన్ని పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయంపూట పరగడుపున కిస్మిస్ లేదా ఎండు ద్రాక్షలు తింటే మంచి ఆరోగ్య ఫలితాలుంటాయి. ఇవి మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కిస్మిస్, ఎండు ద్రాక్షల్లో పెద్దమొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలున్నాయి. ఇవి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత అనేది తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా బాగా పెరుగుతుంది. పరగడుపున కిస్మిస్ తినడం వల్ల ఇమ్యూనిటీ బలమవుతుంది. అందుకే ప్రతిరోజూ కూడా రాత్రి పూట 6 కిస్మిస్ గింజల్ని నీళ్లలో నానబెట్టి వాటిని ఉదయం పరగడుపున నీళ్లతో సహా తినాలని వైద్యులు తెలుపుతున్నారు.
బాదం పప్పులు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఇవి శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. బాదంలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అందులో పెద్దమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే రోజూ వీటిని ఉదయం పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గించేందుకు సైతం బాదం పప్పు ఉపయోగపడుతుంది. అందుకే నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
పరగడుపున రోజూ ఎండు ఖర్జూరం తీసుకుంటే మీరు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాత్రి వేళ నీళ్లలో ఎండు ఖర్జూరాలను నానబెట్టి ఉదయం లేచి తింటే శరీరానికి కావాల్సినంత ఐరన్ అనేది లభిస్తుంది. వీటి వల్ల జీర్ణక్రియ కూడా మెరుగ్గా సాగుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారికి ఎండు ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అద్భుతంగా శక్తిని అందిస్తాయి. జీడిపప్పులు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది. జీడిపప్పులో కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. రోజూ మితంగా జీడిపప్పును తింటే పోషక లోపంతో బాధపడేవారికి అనేక వ్యాధుల(Health Problems) నుంచి ఉపశమనం కలుగుతుంది. జీడిపప్పు అనేది అధిక రక్తపోటును కూడా తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీడిపప్పు ఎముకలను పటిష్టపరుస్తుంది. జీడిపప్పులో ఉండే లుటీస్ కంటిచూపును మెరుగు పరిచి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది.