72-hours: ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపోవాలి (Sleep). నిద్ర (Sleep) సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమిని నయం చేసే వైద్యం లేదా ఔషధం ప్రపంచంలో ఏదీ లేదు. ఆరోగ్యకరమైన నిద్ర శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైనదిగా పరిగణిస్తారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. 18, 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెద్దలు రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఒకరు ఎంతకాలం నిద్ర లేకుండా జీవించగలడనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, చాలా మంది పని, ఒత్తిడి తదితర కారణాల వల్ల పూర్తి నిద్రను పొందలేరు.
నిద్రపోకుండా మెలకువగా కూర్చొని రికార్డు చేస్తారని మీకు తెలుసా? దాదాపు 19 రోజులకు సమానమైన 453 గంటల 40 నిమిషాల పాటు మెలకువగా ఉండి ఓ వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ నిద్రపోనప్పుడు నిద్ర లేమి సంభవిస్తుంది. నిద్రలేమి ప్రభావం వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఒకరు 2 రాత్రులు (48 గంటలు), 3 రాత్రులు (72 గంటలు) నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?
చాలామందిలో 24 గంటల పాటు మెలకువగా ఉన్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. 24 గంటలు మేల్కొన్న తర్వాత రక్తంలో BAC స్థాయి 0.10 శాతానికి సమానం. ఇది చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, పెరిగిన ఒత్తిడి, కండరాల నొప్పి, అధిక రక్తంలో చక్కెర స్థాయిని కలిగిస్తుంది. వ్యక్తి ఎంత మెలకువగా ఉంటే నిద్రలేమి ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా 48 గంటలు నిరంతరం మేల్కొని ఉంటే, అలసిపోతారు. కళ్ళు తెరవడానికి కూడా బాధాకరంగా ఉంటారు. వారి మెదడు మైక్రొస్లీప్ అని పిలువబడే పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం ప్రారంభం అవుతుంది.
నిద్ర లేకుండా 72 గంటల తర్వాత, అలసట లక్షణాలు తీవ్రం అవుతాయి. 3 రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం వల్ల మనిషి మానసిక స్థితి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మూర్ఛ, చిరాకు, ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. ఒకరు స్థిరంగా తగినంత నిద్ర పొందకపోతే.. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా తగినంత నిద్రపోవాలని గుర్తుంచుకోండి.