Spices For Digestion : జీర్ణశక్తిని పెంచే ఈ సుగంధ ద్రవ్యాల్ని వాడి చూడండి!
జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన వంటిళ్లలో బోలెడుంటాయి. అందరికీ తేలికగా అందుబాటులో ఉండే వీటి ద్వారా మన అరుగుదల ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం రండి.
Spices For Digestion జీర్ణ శక్తి బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లే. మన భారతీయ వంటిళ్లలో సహజంగానే జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు బోలెడు. అలాంటి వాటిలో మనకు చాలా తేలికగా అందుబాటులో ఉండే పదార్థాలే ఎక్కువ. వాటిని వాడటం ద్వారా మన జీర్ణ శక్తి ఎలా మెరుగవుతుందో చూసేద్దాం.
అల్లం దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలు ఉన్న వారికి చక్కని మందులా పని చేస్తుంది. కడుపులో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది. అల్లం టీ చేసుకోవడం, వండుకునే ఆహార పదార్థాల్లో దీన్ని చేర్చడం వల్ల జీర్ణం తేలికగా అవుతుంది. కడుపు ఖాళీ అవడానికీ ఇది సహకరిస్తుంది. అలాగే మన ఇళ్లలో ధనియాలను(coriander seeds) ఎక్కువగానే వాడుతూ ఉంటాం. కడుపులో అనీజీగా ఉన్నప్పుడు ధనియాలు, మిరియాలు నీటిలో వేసి మరిగించి ఆ కషాయం తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ధనియాల్లో ఉండే కార్మినేటివ్ ప్రోపర్టీల వల్ల గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి.
ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల్ని(fenugreek seeds) తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. కడుపులో మంట, పొట్ట నొప్పి, వికారం లాంటి వాటికి యాలకులు మందులా పని చేస్తాయి. వీటిలో మాంగనీసు ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం సవ్యంగా అరిగి శక్తినిచ్చేలా చేస్తుంది. మధుమేహం నుంచి కాపాడుతుంది.
జీలకర్రలో ఎక్కువగా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఏ, సీ, కే, ఈ, బీ6లూఉంటాయి. రోజూ 1 టీ స్పూనుడు జీలకర్ర తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. పేగుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంలో ఇది సహకరిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. దీన్ని భోజనానికి ముందు కొంచెం తీసుకుంటే డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ప్రేరేపిస్తుంది. జీర్ణ క్రియలో సహకరిస్తుంది.
Spices For Digestion,seeds for Digestion, Health, Healthy Foods