నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.
కొంతమందికి బయట ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు మీ రోజువారి ఆహారంలో ఈ 5 పండ్లు తీసుకుంటే మీ కడుపు స్థితిని మెరుగుపడుతుంది.
రోగులకు లేదా వారి కుటుంబాలకు రోజూ చెడు సమాచారం ఇవ్వడం వైద్యులకు అంత సులభం కాదు. అయితే, ChatGPT వంటి AI చాట్‌బాట్‌లు ఈ విషయంలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం
కిడ్నీలో రాళ్లను నివారించడానికి రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్, బీర్/ఆల్కహాలిక్ పానీయాలు, మాంసం ఆధారిత గ్రేవీలు, సార్డినెస్, షెల్ఫిష్ వంటి అధిక ప్యూరిన్ ఆహారాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కలిగి ఉన్నఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
నారింజ పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. తీపి, పులుపు కలబోసినట్లుగా ఉండే ఈ రుచిని అందరూ ఇష్టపడతారు. ఈ పండు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజలో విటమిన్ సి(vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం ఫోలేట్ ఉంటాయి.
మన వంటగదిలో సులభంగా లభించే ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు(belly fat)ను తగ్గించవచ్చు. కాబట్టి మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
మన శరీరం ఎముకలు, మాంసాలతో నిర్మితమైంది. అవి సక్రమంగా పనిచేయడానికి రక్తం అవసరం. శరీరానికి సరిపడా రక్తం అందకపోతే ప్రాణానికే ప్రమాదం. శరీరానికి రక్తం అవసరమైనప్పుడు సకాలంలో రక్తాన్ని సరఫరా చేస్తే, వ్యక్తి జీవితాన్ని రక్షించవచ్చు. సరైన సమయంలో రక్తం అందకపోతే ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది.
మీకు చికెన్ అంటే ఇష్టమా..? ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే కాస్త ఆగండి, చికెన్ తీసుకోవడాన్ని కాస్త తగ్గించండి.. లేదంటే అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది.
భారతదేశంలో ప్రారంభమైన యోగా అభ్యాసం ద్వారా శరీరంలోని అనేక రుగ్మతలను నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఇది యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో భాగంగా కూడా ఉంది. యోగా మిమ్మల్ని శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు ఆరోగ్యంగా కూడా మార్చుతుంది. అయితే కొన్ని ఆసనాలు వేయడం ద్వారా యంగ్ గా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం వెంటనే జనాలకు చేరువ అవుతుంది. చాలా మంది నెట్ లో కనపడినదంతా నిజమని నమ్మేస్తూ ఉంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా ఫాలో అవుతున్నారు. తాజాగా సన్ గ్లాసెస్(sun glasses) పెట్టకుంటే వడ దెబ్బ తగులుతుందే ప్రచారం మొదలైంది. అందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి(weight loss) జిమ్, యోగా, వ్యాయామం మాత్రమే కాకుండా స్విమ్మింగ్(swimming), సైక్లింగ్(cycling) వంటివి కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. పిల్లలకు చిన్న వయసులోనే సైకిల్ నేర్పిస్తారు. స్విమ్మింగ్ శిక్షణ కూడా ఇస్తారు. మనం రోజులో కొన్ని గంటలు సైకిల్ తొక్కినా, మన కేలరీలు కరిగిపోతాయి. అదే విధంగా, ఈత బరువు తగ్గడానికి కూడా పనిచేస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం ఇప్పుడు చూద్దాం.
చికెన్‌ను తినేందుకు అనేక మంది ఇష్టపడతారు. ఇది మంచి రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ లతో నిండి ఉంటుంది. అయితే భాగ్యనగరంలో గతంలో రూ.200 ఉన్న చికెన్ రేటు(chicken rate) ప్రస్తుతం 300 రూపాయలు దాటేసింది.