వర్షాకాలం(rainy season) వచ్చేసింది. వర్షాలు అలా పడటం ఆలస్యం. ఇలా దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెడతాయి. వర్షాకాలంలో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వంటి సమస్య విషయంలో, వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చర్యలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. అయితే బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? అవును ఎక్కువ చెమట పట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుందని(Hair loss) నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
మనలో చాలా మందికి ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి మార్పే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం కూడ ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ఆహారం తినడమే కాదు. వాటిని ఎలా తింటే మనకు ప్రయోజనమో కూడా తెలుసుకోవాలి.
2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
ముఖ్యంగా ఆసియాలో చాలా మందికి ప్రధానమైన ఆహారం అన్నం. మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా మారింది. ఎంతగా అంటే చాలా మంది అన్నం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. భోజనం అంటే మనకు కచ్చితంగా అన్నమే అయ్యి ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గడానికి వైట్ రైస్ ని దూరం పెట్టమని చెబుతున్నారు. దాని ప్రకారం ఒక నెలంతా రైస్ ని పక్కన పెడితే ఏం జరుగుతుందో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
అన్ని వయసుల వారిని చంపే వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఏటా లక్షల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ప్రారంభ దశలో దీని లక్షణాలు ఎవరికీ తెలియవు. కొందరు కనిపించినా పట్టించుకోరు. అనేక కారణాల వల్ల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన, ప్రాణాంతక వ్యాధిగా మారింది. క్యాన్సర్ మూడవ దశకు చేరుకున్నప్పుడు భారతదేశంలో చాలా కేసులు నిర్ధారణ అవుతాయి. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడం, ఆ దశలో రోగి ప్రాణాలను కాపాడడం చాలా కష్టమని ...
గర్భధారణ సమయంలో కొందరికి ఆకలి వేయదు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా మందిలో కనిపించేదే. ఇది చాలా సర్వ సాధారణం. ఈ సమయంలో, స్త్రీలు వికారం, అనోరెక్సియా , అనేక ఇతర సమస్యలను కలిగి ఉంటారు, దీని కారణంగా వారు తక్కువ తింటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పోషకాహారం అందాలంటే ఏం చేయాలి?
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు(height)తో ఉండాలని, వెడల్పుగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వారి ప్రవర్తన, వారి జ్ఞానం ద్వారా పిల్లలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే వారి వయస్సును బట్టి తక్కువగా పెరుగుతున్నారని లేదా వారి పెరుగుదల ఆగిపోయిందని మీరు భావిస్తే ఈ వ్యాయామాలు క్రమంగా చేయడం ద్వారా పిల్లల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజుల్లో ఎసిడిటీ చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారం కారణంగా ప్రజలు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఒకసారి మొదలుపెడితే, ఈ ఎసిడిటీని వదిలించుకోవడం కష్టం. ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట, వికారం, వాంతులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి అనేక సమస్యలు వస్తాయి. ప్రజలు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి మందులు తీసుకుంటారు. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే, దుష్ప్రభావాలు...
కోపం ఎవరికి రాదు చెప్పండి? కోపం అనేది ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కరు ఒక్కోసారి తమ కోపాన్ని బయటపెడతారు. సాధారణంగా ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికి తెలియదు. మనసు శాంతించినప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకుంటూ ఉంటాం. కానీ అప్పటికే సమయం మించిపోతోంది. అందుకే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలో ఇప్పుడు చూద...
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.
మీ స్కిన్ పాడు కావొద్దని అనుకుంటే.. చక్కగా మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు ఇంటిలో లైటింగ్, సీటింగ్ చూసుకోవాలి.. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కొంతమందికి బయట ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు మీ రోజువారి ఆహారంలో ఈ 5 పండ్లు తీసుకుంటే మీ కడుపు స్థితిని మెరుగుపడుతుంది.
రోగులకు లేదా వారి కుటుంబాలకు రోజూ చెడు సమాచారం ఇవ్వడం వైద్యులకు అంత సులభం కాదు. అయితే, ChatGPT వంటి AI చాట్‌బాట్‌లు ఈ విషయంలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం