Increasing Fertility: సంతానోత్పత్తిని పెంచే ఆహారాలివే
చాలా మంది దంపతులు సంతానోత్పత్తి(Increasing Fertility) సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి వైద్యులు సమతుల్య ఆహారాన్ని(Healthy Food) తీసుకోవాలని సూచిస్తుంటారు. ఆయిల్ ఫుడ్స్ కు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
చాలా మంది దంపతులు సంతానోత్పత్తి(Increasing Fertility) సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి వైద్యులు సమతుల్య ఆహారాన్ని(Healthy Food) తీసుకోవాలని సూచిస్తుంటారు. వివాహం అయిన తర్వాత సంతానోత్పత్తి సమస్యలు(Fertility Problems) తొలగిపోవాలన్నా, రాకుండా ఉండాలన్నా ఆయిల్ ఫుడ్స్ కు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు తింటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యలు తెలుపుతున్నారు. పెరిగిన ఒత్తిడి స్థాయిలు, జీవనశైలిలో మార్పుల వల్ల అండాలకు హాని జరుగుతోంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
విటమిన్ బీ12 అధికంగా ఉండే ఆహారాలను దంపతులు తీసుకోవడం మంచిది. సీఫుడ్, సాల్మన్, మాంసాలు, పాల ఉత్పత్తులు, గుడ్లలలో విటమిన్ బీ12 అధికంగా ఉంటుంది. ఇవి అండోత్సర్గాన్ని పెంచుతాయి. అలాగే ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కూరగాయలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, కాలే, మెంతులు వంటివి తీసుకోవాలి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. అలాగే బీన్స్ లీన్ ప్రోటీన్, ఐరన్ వంటి విటమిన్ తీసుకోవాలి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బీన్స్ తినడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. బీన్స్ ఒక మహిళ సంతానోత్పత్తిని(Increasing Fertility) పెంచుతుంది.
ఎండిన పండ్లు, కాయలలో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. గింజల్లో అధిక మొత్తంలో సెలీనియం ఉండటం వల్ల అది శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది. మానవ శరీరంలో గుడ్డు ఉత్పత్తిని అది పెంచుతుంది. గుమ్మడికాయ గింజలలో ఉండే జింక్, పురుషులు, స్త్రీలలో ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను పెంచుతుంది. అంతేకాకుండా మహిళల్లో గుడ్డు అభివృద్ధికి(Increasing Fertility) ఎంతగానో తోడ్పడుతుంది. టొమాటోలో ఉండే లైకోపీన్, పురుషుల స్పెర్మ్ కౌంట్‌ను 70% వరకు పెంచుతుందని అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తి(Increasing Fertility) కోసం అరటిపండ్లు తినడం ఎంతో మంచిది. ఇందులో విటమిన్ బి6 ఉంటుంది. ఇంకా పొటాషియం, విటమిన్ సి వంటివి పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం, విటమిన్ బి6 లోపం వల్ల గుడ్లు, స్పెర్మ్‌ల నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా అరటి పండ్లు తినడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.