Health Tips : కొబ్బరిబోండంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలివే
వేసవిలో కొబ్బరి బోండాం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేత కొబ్బరి తినడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కొబ్బరి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి(Summer) వచ్చేసింది. ఎక్కడా చూసినా ప్రజలు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడి(Summer Heat)కి తట్టుకోలేకపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు(Temperature) రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రతను తట్టుకోవడానికి, శరీరానికి తక్షణ శక్తి లభించడానికి కొబ్బరిబోండం(Coconut) ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది కొబ్బరిబోండంలోని నీటి(Coconut Water)ని తాగాక అందులోని కొబ్బరిని తినరు.
కొబ్బరిబోండం(Coconut)లోని లేత కొబ్బరి(Tender coconut)ని తినడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి బాగా పనిచేస్తుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే కొబ్బరి తినడం ఉత్తమం. కొబ్బరి నీరు(Coconut Water) మంచి రీహైడ్రేట్ డ్రింక్ గా పనిచేస్తాయి. లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉండటం వల్ల అది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు కొబ్బరి(Coconut)ని తినడం ఎంతో ఉత్తమం. లేత కొబ్బరి శరీరంలోని నీటి శాతాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను లేత కొబ్బరి బయటకు పంపి మేలు చేస్తుంది. లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. లేత కొబ్బరి(tender coconut) గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేలా చేస్తుంది.
లేత కొబ్బరి(Tender Coconut)లో విటమిన్ ఏ, బీ, సీ వంటివి ఉన్నాయి. ఇంకా కాల్షియం, ఇనుము వంటివి లభిస్తాయి. మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందడానికి లేత కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. లైంగిక శక్తిని పెంచేలా చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తుంది. పచ్చి కొబ్బరి వల్ల దగ్గు, నిమ్ము, ఆయాసం వంటివి పెరుగుతాయి. అదే లేత కొబ్బరి తింటే ఆ సమస్యలేవీ ఉండవు. కొబ్బరి శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి వేసవి తాపం(Summer Heat) నుంచి బయటపడాలంటే లేత కొబ్బరిని తరచూ తినడం ఎంతో ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.