చివరగా యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ బ్యూటీ సమంత. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే.. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధనడుతున్నానని చెప్పింది. అందుకే ప్రమోషన్ కోసం ఒకే ఒక్క ఇంటర్య్వూ చేసింది. అయితే ఈసారి మాత్రం సామ్ ఫుల్లుగా ప్రమోషన్స్ చేయబోతోంది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే.. యశోద తర్వాత కొన్ని రోజులకే కోలుకుంది సామ్. దాంతో శాకుంతలం సినిమాను గట్టిగానే ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్‌కు అటెండ్ అయింది. ఆ సందర్భంగా ఎమోషనల్ కూడా అయింది. దర్శకుడు గుణ శేఖర్ కూడా ఎమోషనల్ అయ్యారు. దాంతో శాకుంతలం పై మంచి బజ్ వచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ ఉండడంతో.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ మరోసారి శాకుంతలం విడుదలని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ దిల్ రాజు అండ్ టీం స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎందుకు వాయిదా పడింది అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆ రోజు బాలీవుడ్లో షెహజాదా, తెలుగులో సార్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శాకుంతలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. సోలో డేట్ అయితే బెటర్ అని భావించి ఉండొచ్చు మేకర్స్. అందుకే పోస్ట్ పోన్ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. శాకుంతలం ఏకంగా రెండు నెలలు వెనక్కి వెళ్లినట్టు సమాచారం. ఏప్రిల్ 14న రిలీజ్ అవనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటించాడు. సమంత శకుంతలా దేవి పాత్రలో నటించింది. వీళ్ల కొడుకు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హా నటించింది.