Celebrity Couples: పెళ్లైన కొత్తలో హానీమూన్ కంపల్సరీ.. రేంజ్‌ను బట్టి కపుల్స్ లోకేషన్స్ ఉంటాయి. ఊటీ, కొడైకెనాల్ కామన్.. విదేశాలకు వెళ్లే వారు ఉంటారు. ఇక సెలబ్రిటీ కపుల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అలాంటి పది హానీమూన్ డెస్టినేషన్స్ ఏంటో తెలుసుకుందాం. పదండి.
1. బోరా బోరా చుట్టూ, దట్టమైన పరిసరాలు.. ఓవర్ వాటర్ బంగ్లాకు ప్రసిద్ధి చెంది ఉంటుంది. విలాసవంత రిసార్ట్స్, ప్రైవేట్ బట్లర్ సర్వీస్, స్పా ట్రీట్మెంట్ సర్వీస్ ఇస్తోంది.
2. కొత్తగా పెళ్లైన వారు హనీమూన్‌కు వచ్చేందుకు ఇష్టపడే ప్లేస్ మాల్దీవులు. ఓవర్ వాటర్ బంగ్లాలలో లగ్జరీగా గడపొచ్చు.
3.గ్రీస్‌లో గల శాంటోరినిలో సూర్యాస్తమయ సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. తెల్లని ఇళ్లు ప్రేమికులకు కొత్త అనుభూతి తీసుకొస్తోంది. మనోహర గ్రామాలనూ చూస్తూ.. లోకల్‌గా దొరికే వైన్ తాగుతూ ఆస్వాదిస్తారు.
4.ఇండోనేషియాలో గల బాలిలో ప్రేమికులు స్వర్గాన్ని చూస్తారు. పూల్తో ఉన్న ప్రైవేట్ విల్లాలో బాలినీస్ ఆహారం ఆస్వాదించవచ్చు.
5.ఇటలీలో గల టస్కానీ కూడా కపుల్స్ ఫేవరెట్ హానీమూన్ స్పాట్. ఫ్లోరెన్స్, సియానా ప్రదేశాలు మైమరపిస్తాయి.
6. హిందూ మహాసముద్రంలో.. 115 ద్వీపాలతో కూడిన సీషెల్స్ ద్వీపం బావుంటుంది. బీచ్, గ్రానైట్ శిఖరాలతో ఆకట్టుకుంటోంది.
7.జపాన్‌లో గల క్యోటోలో చారిత్రాత్మక ఆలయాలను సందర్శించవచ్చు. వెదురు తోటలు, జపనీస్ గార్డెన్లో షికారు చేయవచ్చు.
8. ఫిజీ కూడా కపుల్స్‌కు స్వర్గధామం. ఇక్కడి ప్రకృతి, పచ్చదనం జంటలకు చూపు తిప్పుకోనివ్వదు.
9. లగ్జరీ, అడ్వెంచర్ కలయిక కలిగిన స్పాట్ దుబాయ్. స్కైలెన్ వీక్షణలతో హోటళ్లలో చక్కగా గడపొచ్చు.
10.న్యూజిలాండ్‌లో గల సదరన్ ఆల్ప్స్లో బంగీ జంపింగ్, జెట్ బోటింగ్ థ్రిల్లింగ్ ఇస్తోంది.