Liquor Allergy:మద్యం తాగొద్దు.. డ్రింక్ చేస్తే ఆరోగ్యం పాడవుతోంది.. గొడవలకు దారితీస్తోందని అంటుంటారు. డ్రింక్ చేస్తే అలర్జీ కూడా వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇవీ రేర్ కేసులు అయినప్పటికీ.. అజాగ్రత్త చేస్తే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. అసలు లిక్కర్ అలర్జీ (Liquor Allergy) అంటే ఏంటీ..? మద్యం సేవిస్తూ ఏమేం తీసుకోవద్దో తెలుసుకుందాం. పదండి.
లిక్కర్ అలర్జీ అంటే..?
ఒక్కొక్కరికీ ఒక ఆహార పదార్థం పడదు. ఫిష్, సీ ఫుడ్ తిన్న తర్వాత పెరుగు తీసుకోవద్దని పెద్దలు చెబుతారు. ఇప్పుడు మందు తాగుతూ మసాలా పల్లీ, బఠానీ, చికెన్, మటన్ రోస్ట్ వంటి ఫుడ్ తీసుకుంటారు. దాని వల్ల ఎలర్జీ వస్తోందని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆగ్రాకు చెందిన జాన్‌కు (john) లిక్కర్ అలర్జీ వచ్చింది. అతను చాలా చోట్ల చూయించుకొని.. చివరకు హైదరాబాద్ అశ్విని అలర్జీ సెంటర్ వైద్యులను (ashwini allergy centre) సంప్రదించాడు. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ (nageshwar) నేతృత్వంలోని వైద్యబృందం అతడిని పరీక్షించారు. లిక్కర్ అలర్జీ వచ్చిందని వివరించారు. అలా జరిగే వారు మద్యానికి దూరంగా ఉండాలని.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని చెబుతున్నారు.
లిక్కర్ అలర్జీ కేసులు (Liquor Allergy) చాలా తక్కువ అని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. జాన్ (john) కొంతకాలం కింద విందులో పాల్గొని.. లిక్కర్ తీసుకున్నారట. తర్వాత అతని మొహం వేడిగా మారి ఎర్రబడింది. చర్మంపై దురదలు వచ్చాయి. ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆస్పత్రిలో చేరాడు. ట్రీట్మెంట్ తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది. 2 నెలల తర్వాత మరోసారి డ్రింక్ చేయడంతో అలాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో లిక్కర్‌కు దూరంగా ఉండాలని జాన్‌కు వైద్యుడు నాగేశ్వర్ సూచించారు.
మిగతా వారికి కూడా లిక్కర్ అలర్జీ (Liquor Allergy).. ఇతర అలర్జీలు (allergy) ఉంటాయి. సో.. అలర్జీ ఉంటే వెంటనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.