Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు తప్పుడు సమాచారం.. నాజర్
ప్రస్తుతం బ్రో మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే రాజకీయంగా కూడా పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఓ టాపిక్‌ను టచ్ చేశాడు పవన్. దీంతో పవన్‌కు కౌంటర్‌గా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాజర్ కూడా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నాడనేలా చెప్పుకొచ్చాడు.
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ చిత్ర పరిశ్రమకు కొన్ని సూచనలు, సలహాలు చేశాడు పవన్. ఎందుకంటే.. తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే నటించాలని ‘ఫెప్సీ’ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) కొత్త నిబంధన చేర్చిందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. కోలీవుడ్ ఇష్యూ పై పవర్ స్టార్ స్పందన చూసి.. ఇది గట్స్ అంటూ టాలీవుడ్లో కొందరు పొగిడారు.
‘తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేం.. ఈ విషయంలో తమిళ తంబీలు ఆలోచించుకోవాలని.. దయచేసి అలాంటి రూల్స్ ఉంటే సరిచేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు పవన్. దీంతో పవన్ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఖండించారు. తెలుగు మీడియాతో నాజర్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారని.. ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు.
ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచనలు చేశారు. తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండని అన్నారు. అంతే కానీ, ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎవ్వరూ చెప్పలేదని అన్నారు. ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు.. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం’ అని వివరణ ఇచ్చాడు నాజర్. మరి దీనిపై ఇంకెవరైనా తమిళ తంబీలు స్పందిస్తారేమో చూడాలి.