'Pushpa 2' : పుష్పరాజ్ మళ్లీ థియేటర్లోకి ఎప్పుడొస్తాడని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చిన ఏడాదికి.. పుష్ప2 షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్. ప్రస్తుతం ఈ హిట్ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పుష్పరాజ్ మళ్లీ థియేటర్లోకి ఎప్పుడొస్తాడని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చిన ఏడాదికి.. పుష్ప2 షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్. ప్రస్తుతం ఈ హిట్ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలె వైజాగ్ పోర్ట్ ఏరియాలో కీలక షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారు. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన బారీ సెట్టింగ్స్‌లో షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే.. పెరిగిన అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పుష్ప2ని రూపొందిస్తున్నాడు సుకుమార్. అందుకే బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ వన్‌లో శ్రీవల్లీగా డీ గ్లామర్ రోల్లో దుమ్ముదులిపేసింది అమ్మడు. దాంతో పుష్ప2 పై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సుకుమార్ మాత్రం రష్మికకు షాక్ ఇచ్చేలానే ఉన్నాడట. సెకండ్ పార్ట్‌లో శ్రీవల్లికి స్క్రీన్ స్పేస్ చాలా వరకు తగ్గించారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో కొత్త యాక్టర్స్‌ను తీసుకోవడంతో.. రష్మిక క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని టాక్. అంతేకాదు.. పార్ట్ వన్‌లో పుష్పరాజ్‌తో పెళ్లైపోయింది కాబట్టి.. గ్లామర్ డోస్ కోసం మరో ముద్దుగుమ్మను రంగంలోకి దింపుతున్నారట. దాంతో రష్మిక స్క్రీన్ స్పేస్ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.