ప్రస్థానం సినిమాలో నెగటివ్ రోల్లో దుమ్ములేపిన సందీప్ కిషన్.. హీరోగా రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేదు. అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో మైఖేల్ అనే సినిమా చేశాడు. ట్రైలర్‌తోనే ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు. సందీప్ కిషన్ మాస్ అటెంప్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. 1991 బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం.. డార్క్ మోడ్‌లో తెరకెక్కించారని అంటున్నారు. దాంతో ‘కెజిఎఫ్’ ఎఫెక్ట్ మైఖేల్ పై గట్టిగానే పడిందంటున్నారు. అనుకున్నంత స్థాయిలో డైరెక్టర్ ఈ సినిమాను హ్యాండిల్ చేయలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్‌ను సరిగా వాడుకోలేదని అంటున్నారు. అయితే మైఖేల్‌గా సందీప్ కిషన్ అదరగొట్టాడని అంటున్నారు. అలాగే హీరోయిన్గా నటించిన దివ్యాంశ కౌశిక్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. వరుణ్ సందేశ్ కూడా బాగానే చేశాడంటున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా.. మైఖేల్ కథలో డెప్త్ ఉన్నా.. సీన్స్ కన్ ఫ్యూజ్డ్గా స్లో అండ్ రొటీన్‌గా ఉన్నాయని అంటున్నారు. కెజియఫ్ సినిమా తరహాలో ట్రై చేసినా.. లాజిక్స్ లేకుండా మైఖేల్ ముందుకు సాగాడని అంటున్నారు. మొత్తంగా కొన్ని ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ బాగున్నాయని అంటున్నారు. మరి ఈ టాక్‌తో మైఖేల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.