»Varun Tejs Wedding Expenses Can Build A House For 100 Poor People
VarunLav: వరుణ్ తేజ్ పెళ్లికి నాగబాబు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
VarunLav: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరై సందడి చేశారు. ఈ విధంగా స్టార్ హీరోలందరూ కలిసి కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. దీంతో వారి అభిమానులంతా సోషల్ మీడియాలో కామెంట్లతో ముంచెత్తుతున్నారు. అదే సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ ఖర్చుల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ పెళ్లి కోసం నాగబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ప్రతిదీ కాస్ట్లీయేనట. కుటుంబంలో అందరికీ గుర్తుండిపోయే విధంగా వీరిద్దరి పెళ్లికి దాదాపు రూ.10కోట్లకు పైగా ఖర్చు చేశామని నాగబాబు తెలిపారు. ఈ వివాహానికి మెగా, అల్లు, లావణ్య త్రిపాఠి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సన్నిహితులతో పాటు దగ్గర బంధువులు దాదాపు 120 మంది హాజరయ్యారు. హల్దీ, మెహందీ, కాక్టెయిల్ పార్టీ, మ్యారేజ్ పార్టీ ఇలా.. అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేశారు. ఇలా లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. అయితే వీరి రిసెప్షన్ పార్టీ నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.