ప్రభాస్ క్రేజ్‌ను తట్టుకోలేక బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయినా కూడా బాహుబలి మొదటి భాగాన్ని ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రభాస్ దెబ్బకు ఒక్కసారిగా ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. ఈ లెక్కన ప్రభాస్, బాలయ్య కోసం సినీ లవర్స్ ఎంతలా వెయిట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుకున్నట్టు ఈ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్లో బాలయ్యతో రామ్ చరణ్ ఫోన్ కాల్ హైలైట్‌గా నిలిచింది. చరణ్, బాలయ్య మధ్య కన్వర్జేషన్.. ప్రభాస్ గురించి చరణ్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాడేమోనని ఎదురుచూసిన వారిని కన్ఫ్యూజన్లో పడేశాడు డార్లింగ్. అనుకున్నట్లుగానే ప్రభాస్ నుండి పెళ్లి మ్యాటర్ రాబట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. కానీ నాకు రాసి పెట్టి లేదేమో.. సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో, అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే రామ్ చరణ్ మాత్రం ప్రభాస్‌ని కాస్త కంగారు పెట్టాడు. చరణ్‌తో ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పమనగా.. ఏదో ఒకటి చెప్పేయ్ పేర్లేదని అన్నాడు ప్రభాస్. దాంతో త్వరలోనే ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చెప్పాడు చరణ్. బాబోయ్.. అది ఏదో కంప్లీట్ చేయమని చెప్పాడు ప్రభాస్. దానికి తోడు ప్రభాస్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి రెడ్డి, రాజు, చౌదరి, నాయుడు లేదా శెట్టి, సనన్నా.. నాకు జస్ట్ హింట్ ఇవ్వు అన్నాడు బాలయ్య. అయినా ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ రాలేదు. మొత్తంగా ఈ ఎపిసోడ్లో చరణ్ ఫోన్ కాల్ ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. అయితే చరణ్ చెప్పినట్లుగా ప్రభాస్ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటనే ఆత్రుత మాత్రం అందరిలోను మొదలైంది. మరి జనవరి 6న రానున్న సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ ఇంకెంత సందడి చేశాడో చూడాలి.