»Solid Confirmation On Prabhas Salaar Movie 2 Parts
Salaar: ‘సలార్’ 2 పార్ట్స్ పై సాలిడ్ కన్ఫర్మేషన్!
రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్(Salaar) మూవీ(movie)పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని.. తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడనే టాక్ ప్రచారంలో ఉంది. అలాగే కేజియఫ్ లాగే ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్.. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడనే చర్చ జరుగుతునే ఉంది.
కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా సలార్(Salaar)సీక్వెల్ పై సాలిడ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమాలో నటిస్తున్న కన్నడ యాక్టర్ దేవరాజు.. ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాను సలార్ మూవీలో నటిస్తున్నానని.. అయితే ఫస్ట్ పార్ట్‌లో తనకు తక్కువ సీన్స్ ఉంటాయని.. కానీ సెకండ్ పార్ట్‌లో ఎక్కువ సీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో సలార్ 2 పార్ట్స్‌గా తెరకెక్కుతోందనే క్లారిటీ వచ్చేసినట్టే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సలార్ పార్ట్ 1 షూటింగ్‌కి కంప్లీట్ అవనుంది.
మే నెలలో షూటింగ్ కంప్లీట్ చేసి.. పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ఒకేసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారా? లేదంటే పార్ట్ వన్ కంప్లీట్ అయ్యాక పార్ట్ 2 చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.