Mahesh-Rajamouli: ‘మహేష్-రాజమౌళి’ పై అన్నీ పుకార్లే!
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటింగ్‌గా మారింది. కానీ తాజాగా అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
రీసెంట్గా ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు(mahesh babu) పాత్ర హనుమంతుని సూర్తితో డిజైన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. హనుమంతుని లాగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కి అసమాన శక్తులు ఉంటాయని.. జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇలాంటి పుకార్లను రాజమౌళి(Rajamouli) తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కొట్టిపారేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మహేష్ రోల్ హనుమాన్ స్పూర్తితో ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో.. ఎలాంటి నిజం లేదని తెలిపారట.
ఈ వార్త ఎవరో కావాలని పుట్టించారని విజయేంద్ర ప్రసాద్ చెప్పారట. దీంతో మహేష్ రోల్ పై జరుగుతున్న పుకార్లకు చెక్ పడినట్టైంది. ఇకపోతే.. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్‌తో కలిసి ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత రాజమౌళితో చేతులు కలపనున్నాడు మహేష్. ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. మొత్తంగా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ తర్వాత.. మహేష్‌తో హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.