Dhanush : ‘సార్’ ముందే వచ్చేస్తున్నాడు.. తేడా కొట్టిందో..!
Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 17న థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సార్ పై మంచి బజ్ ఏర్పడింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 17న థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సార్ పై మంచి బజ్ ఏర్పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాకతో సార్ పై మరింత హైప్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే చెప్పుకొచ్చాడు. ఇక వెంకీ అట్లూరి అయితే.. ఈ బొమ్మ తెలుగులో నాలుగు వీకెండ్స్, తమిళ్లో ఎనిమిది వీకెండ్స్ చూస్తుందని.. బల్లగుద్ది మరీ చెప్పాడు. దీంతో సార్ పై గట్టి నమ్మకమే పెట్టుకుంది చిత్ర యూనిట్. అందుకే ఓ రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి 7 గంటలకు చెన్నై, హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 3 షోలు వేస్తున్నారు. ఈ ప్రీమియర్ ప్రకటించిన గంటకే హౌస్ ఫుల్ బోర్డ్ పడిపోయింది. అయితే.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేయడం అంటే.. ఎవరు చేయని సాహసం అనే చెప్పాలి. ప్రస్తుతం సినిమాల పై సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. అలా షో పడడమే ఆలస్యం.. ట్విట్టర్ రివ్యూలు, సినిమా టాక్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. టాక్ బాగుంటే ఓకే.. కానీ ఏ మాత్రం తేడా కొట్టిన ఫలితం వేరేలా ఉంటుంది. మామూలుగా రిలీజ్ రోజే సినిమా థియేటర్లోకి వస్తే.. ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. కానీ సార్ ముందే వచ్చేస్తున్నాడు కాబట్టి.. సోషల్ మీడియా టాక్, ఫస్ట్ డే కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల మాట. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ఓపెనింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సార్ విషయంలో ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి సార్ ఏం చేస్తాడో చూడాలి.