»Shah Rukh Completed 31 Years In The Film Industry Chit Chat With Fans
Shah rukh khan: సినీ రంగంలో షారూఖ్ 31 ఏళ్లు పూర్తి..ఫ్యాన్స్ తో చాట్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(shah rukh khan) సినీ రంగంలో తన 31 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ వంటి బ్లాక్ బస్టర్‌తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి తన సత్తా చాటారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(shah rukh khan). సెప్టెంబర్ 7న మరోసారి పాన్ ఇండియా లెవల్లో సందడి చేయటానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే షారూక్ ఈ ఏడాదితో సినీ జర్నీ ప్రారంభించి 31 వసంతాలను పూర్తి చేసుకోవటం విశేషం. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, ఫాలోవర్స్‌తో #AskSRK కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో కవల పిల్లలకు మీ మూవీ పేర్లు?
ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. డాక్టర్ కవల పిల్లలని చెప్పారు. వారికి పఠాన్, జవాన్ అనే పేర్లు పెట్టాలనుకుంటున్నానని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు.
అలా కుదరదు!
ఓ అభిమాని తన స్నేహితుడు కోసం జవాన్‌లో పాత్రను ఇవ్వాలని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ ‘అలా చేయటం కుదరని ప్రేమతో మీ స్నేహితుడుకి అర్థమయ్యేలా చెప్పండని అన్నారు.
థియేటర్లో ఎంజాయ్ చేయండి?
జవాన్ సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్నకు షారూక్ ఖాన్ బదులిస్తూ ‘లేదు బిడ్డా.. స్నేహితులతో కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందే’ అన్నారు.
‘జవాన్’ టీజర్ ఎప్పుడు?
జవాన్ టీజర్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘టీజర్ సిద్ధమవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సిద్ధం చేసి చూపిస్తా’నని అన్నారు.
జీవితంలో కొన్నిసార్లు ఉపయోగపడుతుంది!
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారూక్ సమాధానం ఇస్తూ..ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుంది.. కొన్నిసార్లు అని సమాధానం ఇచ్చారు.