ప్రశాంత్ నీల్.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. కెజియఫ్ లాంటి హై ఓల్టేజ్ సినిమా చూసి.. తమ అభిమాన హీరోలను ఇంకెలా చూపిస్తాడోనని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగు స్టార్ హీరోలతో సినిమాల చేస్తుండడంతో.. ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి అప్టేట్స్ వచ్చినా.. క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. అయితే ఇక పై ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సోషల్ మీడియా దూరంగా ఉండాలనుకోవడం.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో సినిమాలపై సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అంటే.. ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్స్ అందించేవారు. కానీ ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చాక.. సినిమాల కొత్త అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కూడా ట్విట్లర్లో యాక్టివగ్గా ఉంటూ.. ఫ్యాన్స్‌కు అప్డేట్స్ అందిస్తుంటాడు. కానీ ఉన్నట్టుండి.. తన ట్విట్టర్ ఎక్కౌంట్ని క్లోజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ప్రశాంత్ నీల్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ఎవరికి అర్దం కావడంలేదు. కానీ దానికి కారణం ఇదేనని అంటున్నారు. జనవరి 8న యశ్ బర్త్ డే సందర్భంగా.. ఉర్దూలో విష్ చేశాడు ప్రశాంత్ నీల్. దీనిపై ఓ వర్గం కన్నడిగులు మండిపడ్డారు. కన్నడలో ట్వీట్ చేయోచ్చు కదా అని.. ప్రశాంత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాతే ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ అయింది. అయితే దీని వల్లే నీల్ ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడా.. లేదంటే ఎవరైనా హ్యాక్ చేసి అకౌంట్ క్లోజ్ చేశారా.. అనేది క్లారిటీ లేదు. ఈ విషయంలో మాత్రం ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు.