Prabhas - Surya : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ ఏడు నెలల గ్యాప్‌తో థియేటర్లోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం. అలాంటి హీరో ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే.. ఆ సినిమాకు మరింత వెయిట్ పెరగనుంది. అందుకే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోసం ప్రభాస్ గెస్ట్‌గా మారబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య.. సిరుత్తై శివ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య కెరీర్లోనే ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రాబోతోంది. ఏకంగా పది భాషలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రభాస్ లాంటి స్టార్ హీరో చేత గెస్ట్ రోల్ చేయిస్తే.. సినిమాకు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారట మేకర్స్. సూర్యతో ప్రభాస్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా ఈ సినిమాను స్టూడియోగ్రీన్ సంస్థతో కలిసి ప్రభాస్ సొంత బ్యానర్ యువిక్రియేషన్స్ నిర్మిస్తోంది. అందుకే ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపించడం ఖాయమంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో ప్రభాస్ మహారాజుగా కనిపించబోతున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. అదే జరిగితే బాహుబలి తర్వాత.. ప్రభాస్‌ను రాజుగా చూసి ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా. అయితే ప్రభాస్ అతిథి పాత్రలో కనిపిస్తాడా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.