నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో.. ప్రస్తుతం ప్రభాస్ మేనియా నడుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా బాహుబతి ఫస్ట్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. జనవరి 6న సెకండ్ పార్ట్ ప్రసారం చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత వారం.. అంటే జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆహా టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా ఈ ఎపిసోడ్‌ను వాయిదా వేశారు. జనవరి 13న కొంతమంది గెస్ట్‌లతో స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నారట. దాంతో ఆ స్పెషల్ ఎపిసోడ్ ఏంటనే ఆసక్తి అందరిలోను మొదలైంది. అయితే ఆహా వర్గాల ప్రకారం.. వీర సింహారెడ్డి టీమ్ సభ్యులతో నందమూరి బాలకృష్ణ ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే జనవరి 13న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. మరి పవన్ ఎపిసోడ్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారనే డౌట్ అందరిలోను ఉంది. ఆ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను జనవరి 26న, రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే సంక్రాంతికి మాత్రం పవన్‌కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేయాలని అనుకుంటున్నారట. పవన్ ఎపిసోడ్‌తోనే అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడబోతోందని టాక్. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.