ప్రస్తుతం రాజకీయంతో పాటు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్‌కు ఒక్క హీరోగానే కాదు.. దర్శకత్వం చేయడం కూడా చాలా ఇష్టం. అందుకే పవన్ రైటింగ్, డైరెక్షన్లో ‘జాని’ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.. అయితే పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది. ముఖ్యంగా పవన్ యాక్షన్ కట్టిపడేసింది. అయితే జాని ఫ్లాప్ అవడంతో.. ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు పవన్. కానీ అప్ కమింగ్ పాన్ ఇండియి ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ కోసం యాక్షన్ చెప్పారట పవన్. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రామోజి ఫిలిం సిటీలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వీటిని స్టంట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో పూర్తి చేసారు. అయితే పవన్ కూడా యాక్షన్ సన్నివేశాల కోసం స్టంట్స్ కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలోని మార్షల్ ఆర్స్ట్కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కావడంతో.. పవన్ ఆ భారీ ఫైట్‌ను స్వయంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా 15 నిమిషాల పాటు ఉండే ఈ సీక్వెన్స్.. సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని టాక్. అయితే ఇది ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ అని తెలుస్తోంది. అందుకే మేకర్స్ ఈ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. ఇకపోతే.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను. ఏఎం.రత్నం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. హరిహర వీరమల్లు పై భారీ అంచనాలున్నాయి.