వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. దర్శకుడు మగిళ్ తిరుమేనితో విజయ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్‌గా చేయనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. చరణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సాంగ్ ఉండబోతుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయారు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నారు.
హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయాడు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నాడు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ పేరు ‘ఎస్.సరస్వతి’గా మారింది. సెన్సార్ బోర్డు సూచనతో చిత్ర యూనిట్ ఈ మార్పు చేసింది. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం 2 గంటల 1 నిమిషం నిడివితో రాబోతుంది. గతంలో చాయ్ వాలా వంటి చిత్రాలు కూడా ఇలాగే పేర్లు మార్చుకున్నాయి.
యూట్యూబ్‌లో ప్రస్తుతం మాస్ బీట్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్ ‘రైరై రారా’ సాంగ్ 24 గంటల్లోనే 31 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. AR రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. మరోవైపు నాని ‘ ది ప్యారడైజ్’లోని ఆయా షేర్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలోని నాని లుక్, స్టెప్పులకు యూత్ కనెక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ నిన్న రాత్రి ప్రారంభమైంది. సతీష్ కిలారు (వృద్ధి సినిమాస్) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం నవంబర్ 2025లో ప్రారంభమైన విహాయం తెలిసిందే. తాజాగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ లొకేషన్ పిక్ షేర్ చేస్తూ అప్‌డేట్ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్‌లో రష్మిక తల్లిదండ్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖరీదైన దుస్తులకు పోకుండా, తమ కొడవా(కూర్గ్) గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తండ్రి ‘కుప్యా’ కోటులో, తల్లి ప్రత్యేక కొడవ చీరకట్టులో మెరిశారు. సెలబ్రిటీ వేడుకలోనూ తమ మూలాలను, వారసత్వాన్ని ఘనంగా చాటిచెప్పిన ఈ జంట అందరి ప్రశంసలు అందుకుంటోంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘నామోరే’ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను మార్చి 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మాస్ మహారాజా రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముగ్గురు ఒకేచోట కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. మార్చి 4న జరిగిన విజయ్, రష్మిక రిసెప్షన్‌లో రవితేజ సందడి చేశాడు. వారికి కంగ్రాట్స్ చెప్పి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్, రవితేజ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన మార్చి 26, 2026కు బదులుగా, ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పవర్ స్టార్ సినిమా థియేటర్లకు ముందుగానే వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న థియేటర్లలోకి రాబోతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 1 గంట 58 నిమిషాల తక్కువ రన్ టైంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న నిడివి ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ మూవీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయినట్లు టాక్. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మంచు మనోజ్ కథానాయకుడిగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ చిత్రం రూపొందుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారిపై పోరాడిన ఒక యోధుడి గాథగా ఈ సినిమా రానుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం కథానాయిక రాశి ఖన్నాని ఎంపిక చేసినట్లు సమాచారం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ సరసన రాశి స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది.
రజినీకాంత్, షారుఖ్ ఖాన్‌ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తన ‘డ్రీమ్ కాంబినేషన్’ గురించి మాట్లాడుతూ, రజినీ, షారుఖ్‌లను ఒకే తెరపై చూడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. వీరికి సంగీతం అందించడం తన కెరీర్‌లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అన్నాడు. దీంతో నెటిజన్లు ఈ కాంబో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.