Megastar Chiranjeevi: హైవేపై మెగాస్టార్ 100 అడుగుల భారీ కటౌట్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రస్తుతం మెగాస్టార్ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఓ హైవేకి దగ్గరగా ఉండడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా మెగాస్టార్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయినా.. మెగాస్టార్ మెగాస్టారే అని.. రీ ఎంట్రీ తర్వాత నిరూపించాడు చిరు. ఖైదీ నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. 67 ఏళ్ల వయసులోను మెగాస్టార్.. అదే స్టైల్, అదే గ్రేస్, అదే డ్యాన్స్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. చివరగా వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన చిరు.. ఇప్పుడు భోళా శంకర్‌గా వస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో.. ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు మేకర్స్. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్లో మెగాస్టార్ గ్రేస్, మాస్‌ని చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెంచాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మెగాస్టార్ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేసింది. తెలంగాణలోని సూర్యాపేటలో విజయవాడ-హైదరాబాద్ హైవే పక్కన రాజు గారి తోట వద్ద.. మెగాస్టార్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్దదని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
అయితే, ఈ కటౌట్ ఎన్ని అడుగులు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ ఈ భారీ కటౌట్ దాదాపు వంద అడుగులు ఉంటుందని అంటున్నారు. ఇక తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయబోతున్నాడు చిరు. ఆగష్టులో మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతోంది.