»Hyper Aadi Wedding With Jabardasth Anchor Gossip News Viral
Hyper Aadi: జబర్దస్త్ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి?
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన ప్రత్యేకమైన పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హైపర్ ఆది అంటే మనకు ఆయన హై పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. ఏ విషయంలోనైనా పంచ్‌లు వేయగలడు. స్క్రిప్ట్ మొత్తం పంచ్‌లతో కూడుకున్నదనడంలో సందేహం లేదు. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
హైపర్ ఆది(Hyper Aadi) జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. అతను తన పంచ్ డైలాగ్‌లతో ఫేమస్ అయ్యాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, సెటైర్స్ తో రచ్చ సృష్టిస్తాడు. ప్రతి స్కిట్లో ప్రేమ, పెళ్లి వంటి అంశాలను జోడించి ఆకర్షిస్తున్నాడు. దీంతోపాటు గతంలో అనుభవించు రాజా, కామెడీ షో, సినిమా చూపిస్తా మామా (ఈటీవీ ప్లస్) సహ పలు షోలలో యాంకర్ గెటప్ లలో కూడా కనిపించాడు. అయితే తాజాగా హైపర్ ఆది జబర్దస్త్ యాంకర్(Jabardasth anchor) తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి పెళ్లి(wedding)కి ఇరువురి కుటుంబాలు కూడా ఒప్పుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో వీరి ఎంగేజ్ మెంట్ త్వరలో జరగనుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇందులో నిజం ఏంటి? అసలు విషయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
హైపర్ ఆది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 1987లో జన్మించాడు. 2012లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్(hyderabad)లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాడు. ఆది షార్ట్ ఫిల్మ్స్ చూసి, అప్పటికే జబర్దస్త్‌లో పనిచేస్తున్న అభి నుంచి కాల్ వచ్చింది. స్కిట్ల కోసం స్క్రిప్ట్‌లు రాయమని అభి అతన్ని అడిగారు. అతను కూడా అభి టీమ్‌లో చిన్న పాత్ర పోషించేవాడు. ఆ తర్వాత క్రమంలో గుర్తింపు దక్కించుకుని టీమ్ లీడర్ స్థాయికి చేరాడు. ఆ తర్వాత తెలుగులో కామెడీ షో ‘జబర్దస్త్’లో ఎంట్రీ ఇచ్చి మంచి కమెడీయన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. దీంతోపాటు ప్రస్తుతం అనేక సినిమాల్లో యాక్ట్ చేస్తు ఆది మంచి జోరు మీద ఉన్నాడు.