Devara Movie: ‘దేవర’ కోసం బాహుబలి, RRR ఫైట్ మాస్టర్!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా మరో కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతోంది దేవర చిత్ర యూనిట్. అయితే ఇది కూడా పవర్ ఫుల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. అందుకోసం బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఫైట్ మాస్టర్‌ను రంగంలోకి దింపుతున్నారట.
కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ కోసం ఎందుకంత సమయం తీసుకున్నాడో.. ఇప్పుడు దేవర స్పీడ్ చూస్తే చెప్పొచ్చు. నాన్ స్టాప్ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేవరను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. యాక్షన్ సీన్స్నే తెరకెక్కిస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా చిత్రీకరిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఐదారు భారీ యాక్షన్స్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దేవర. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇది కూడా పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే అని తెలుస్తోంది. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్తో ఈ షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మేకర్స్ కూడా ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నారట.
ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో దేవరను భారీ ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ వరకు ఎన్టీఆర్ దేవర షూటింగ్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ వార్2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మరి దేవర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.