»Devara Is Very Special Koratala Who Raised Expectations
Devara: దేవర చాలా స్పెషల్.. అంచనాలు పెంచేసిన కొరటాల
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై కొరటాల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Devara is very special.. Koratala who raised expectations
Devara: ‘దేవర’ సినిమా కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడం ఒకటైతే.. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాలను నమ్మి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. ఆచార్య సినిమా చూసిన వారంతా.. అప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని కొరటాలతో.. ఎన్టీఆర్ సినిమా చేయకపోవడమే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఒక్క టైగర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. అందుకే.. దేవర సినిమాతో కొరటాల ఏం చేస్తాడు? అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా ఓపెనింగ్ రోజే.. నా హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు కొరటాల. ఇక టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. ఎర్ర సముద్రం అంటూ.. కొరటాల ఇచ్చిన హై మామూలుగా లేదు.
ఇక స్వయంగా ఎన్టీఆర్, కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుందని చెప్పడంతో, అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు కొరటాల చేసిన కామెంట్స్‌తో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. లేటెస్ట్గా సత్యదేవ్ కృష్ణమ్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘దేవర’ గురించి మాట్లాడాడు కొరటాల. ఇప్పటికే దేవర గురించి చాలా మాట్లాడాను.. ఇటీవల తారక్ కూడా దీని గురించి చెప్పాడు.. నాకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దేవర చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. దాని గురించి ఇంకా మాట్లడాడానికి చాలా టైం ఉంది.. అని అన్నారు. దీంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. మరి.. ఆచార్య తర్వాత సైలెంట్‌గా తన పని తానుకు చేసుకుంటు పోతున్న కొరటాల.. దేవరతో ఎలాంటి హిట్ కొడతాడనేది తెలియాలంటే.. అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే!