టాలీవుడ్(Tollywood)లో సరికొత్త ప్రేమకథ(Love story)తో మరో జంట తెలుగు తెరకు పరిచయం అవుతోంది. యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త లవ్ స్టోరీతో 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'(Krishnagadu ante oka range) అనే సినిమా రూపొందుతోంది. రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. పెట్లా కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, శ్రీలత సంయుక్తంగా ఈ మూవీ(Movie)ని రూపొందించారు.
ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని చెప్పింది. అంజు కృష్ణ అనే నాటక నటిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
Prabhas : 'ఆదిపురుష్'ను డైరెక్టర్ ఓం రౌత్ ఏం చేస్తాడోనని.. కాస్త టెన్షన్‌గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ పై డౌట్స్ పెరిగాయి. టీజర్‌లో గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. అయితే ఒకవేళ విజువల్ పరంగా ఓం రౌత్ సక్సెస్ అయితే మాత్రం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం పక్కా.
'Mahesh-Rajamouli' : ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. షూటింగ్‌కు ముందు చాలా రోజుల పాటు ప్రభాస్, రానా, అనుష్కలతో వర్క్ షాప్ నిర్వహించాడు. వాళ్లు యుద్ధం కోసం ఎంతగానో శ్రమించారు.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్, లీక్డ్ లుక్స్ చూస్తే.. ఆ విషయం అర్థమవుతోంది.
Grand Launch : ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, దిల్ రాజు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ.. సముద్రం నేపథ్యంలో.. కోస్టల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరెక్కబోతోంది.
Jr.NTR : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఆచార్య ఫ్లాప్, ఆర్ఆర్ఆర్, ఆస్కార్, తారకరత్న మరణం.. ఇలా ఎన్నో అవోరోధాలని దాటుకొని ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నప్రాజెక్ట్ K(Project K) చిత్రంలో చేరినట్లు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. 2024 జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ. అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Vijay) నటిస్తున్న 'లియో(LEO)' చిత్రానికి భూకంపం(Earthquake) ప్రభావం కనిపించింది. లియో చిత్రానికి కో రైటర్ గా ఉన్న రత్న కుమార్ ఈ మేరకు మంగళవారం రాత్రి బ్లడీ ఎర్త్ క్వేక్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత అందరూ సురక్షితంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Chiranjeevi : వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు.
Nani : మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు నాని. అలాగే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి.. అంటూ రోజుకో ఊరమాస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక పోస్టర్స్‌లో నాని లుక్ చూసి.. సినిమా పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.
Vishwak Sen : ధమ్కీ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశాడు విశ్వక్ సేన్. ప్రమోషన్లో భాగంగా చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్ ఉంది.. థియేటర్లోకి వెళ్లి చూడండి.. అని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు మాస్ కా దాస్. ఇక ఉగాది కానుకగా ధమ్కీ రిలీజ్ అయిపోయింది.
NBK 108 : అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు నందమూరి బాలకృష్ణ. ఇదే ఊపులో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు. పటాస్ నుంచి F3 వరకు ఫన్ డోస్ ఎక్కువగా చూపించిన అనిల్.. ఈసారి బాలయ్యతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Jr.NTR : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ ఉగాదికి గ్రాండ్‌గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాను నందమూరి టచ్‌తో భారీగా ప్రమోషన్స్ చేశాడు విశ్వక్. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో.. సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఆస్కార్ తర్వాత తారక్ వచ్చిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఇదే.