»This Is The Highlight Of Ntr 30 But Who Is The Villain
Jr.NTR : ఎన్టీఆర్ 30లో ఇదే హైలెట్.. మరి విలన్ ఎవరు!?
Jr.NTR : ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ పై.. ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరిచిపోయిన కోస్టల్ ఏరియాలో ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో యంగ్ టైగర్ మృగాల వేటను చూస్తారని.. చెబుతున్నాడు కొరటాల.
ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ పై.. ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరిచిపోయిన కోస్టల్ ఏరియాలో ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో యంగ్ టైగర్ మృగాల వేటను చూస్తారని.. చెబుతున్నాడు కొరటాల. అందుకు తగ్గట్టే యాక్షన్ సీక్వెన్స్‌ను అంతకుమించి అనేలా తెరకెక్కించబోతున్నాడు. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్‌ని ఇప్పటికే రంగంలోకి దించేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 యూనిట్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొంటున్నారు కెన్ని బేట్స్. ఇటీవలె పూజా కార్యక్రమాలు జరిగిన ఈ సినిమాను.. అతి త్వరలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేయబోతున్నారు. సముద్రంలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌తో పాటు కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించనున్నారట. ఈ సీక్వెన్స్‌ని కెన్ని బేట్స్ గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాడట. సముద్రంలో కార్గో షిప్ పై జరిగే యాక్షన్.. సినిమాకే హైలెట్ అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్‌కి కూడా హాలీవుడ్ మాస్టరే కంపోచ్ చేయనున్నాడట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. కానీ ఓ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదంటున్నారు. హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉన్నా.. విలన్ రోల్ అంతకుమించి అనేలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాని ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తలపడే విలన్ ఎవరో తెలియడం లేదు. ఆ మధ్యలో బాలీవుడ్ నుంచి విలన్‌ను ఇంపోర్ట్ చేస్తున్నట్టు వినిపించింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా విలన్‌ను అనౌన్స్ చేయలేదు కొరటాల. దీంతో ఎన్టీఆర్ 30లో విలన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. కానీ యంగ్ టైగర్‌కు ధీటుగా పవర్ ఫుల్ విలన్ని తీసుకోబోతున్నాడట కొరటాల. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.