యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. మార్చి థర్డ్ వీక్ నుంచి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కనున్నాయి. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం పాన్ వరల్డ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే డౌట్ అందరిలోను ఉంది. కానీ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ డౌట్ క్లియర్ చేసేశారు. నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో బిగ్ స్కేల్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే చెప్పేశాడు. అయితే మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫామ్ చేశాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ టచ్ చేయని జానర్లో ఉండబోతోందని.. ఇదో పౌరాణికం సినిమా అని అన్నాడు. అలాగే మరో సాలిడ్ హింట్ ఇచ్చేశాడు. హాలీవుడ్ మూవీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. దాంతో ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రాబోతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం తారక్ కమిట్ అయిన రెండు సినిమాలు అయిపోయేలోపు.. త్రివిక్రమ్ కూడా ఎస్ఎస్ఎంబీ 28తో పాటు.. మరో సినిమా కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత ఈ క్రేజీ కాంబో ఉంటుంది. ఏదేమైనా నాగవంశీ ఈ రేంజ్లో చెబుతున్నాడంటే.. ఎన్టీఆర్‌తో అంతకుమించి అనేలానే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు.