NTR : HCA వారు ఎన్టీఆర్‌ని పిలిచారు.. కానీ ఆరోజే అమెరికా పయనం!
NTR : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా 5 కేటగిరిల్లో అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. అలాగే HCA అవార్డ్స్ ఈవెంట్లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి.. ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా 5 కేటగిరిల్లో అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. అలాగే HCA అవార్డ్స్ ఈవెంట్లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి.. ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగింది.. క్రెడిట్ మొత్తం చరణ్‌కే దక్కుతోంది.. తారక్‌ని ఎందుకు పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ని మేము ఇన్వైట్ చేశాము.. కానీ అతను ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అందుకే HCA ఈవెంట్‌కి రాలేదు. త్వరలోనే ఎన్టీఆర్ అవార్డ్ అందుకుంటాడని.. ట్వీట్ చేశారు. వాస్తవానికైతే.. ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా లేడు, తారక రత్న మరణంతో వెళ్లలేకపోయాడు. కానీ త్వరలోనే అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి పాల్గొననున్నారు ఎన్టీఆర్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మార్చి 5న ఎన్టీఆర్ అమెరికా బయల్దేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ 30 షూటింగ్లో జాయిన్ అవేనున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.