Jr.NTR : ఎట్టకేలకు ఎన్టీఆర్ 30ని ఈ నెల 24న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అంటున్నారు.
ఎట్టకేలకు ఎన్టీఆర్ 30ని ఈ నెల 24న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అంటున్నారు. ఈ క్రమంలో.. ఈ ప్రాజెక్ట్ స్టార్ క్యాస్టింగ్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. విలన్‌గా విక్రమ్ లేదా సైఫ్ అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు సైఫ్ అలీఖాన్ దాదాపుగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఈయన ప్రభాస్ ‘ఆదిపురుష్’లో రావణ్‌గా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్గా జాన్వీ జాపూర్ కన్ఫర్మ్ అంటున్నారు. సినిమా ఓపెనింగ్ రోజు దీని పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని.. ఇదో రివెంజ్ డ్రామా మూవీ అని.. ప్రచారం జరుగుతోంది. ఇందులో తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ చేయబోతున్నాడట తారక్. గతంలో ఆంధ్రావాలా, శక్తి సినిమాల్లో తండ్రీకొడుకుగా నటించాడు ఎన్టీఆర్. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దాంతో ఎన్టీఆర్ 30 డబుల్ ట్రీట్ విషయంలో భయపడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ కొరటాల మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. కొరటాల కూడా ఆచార్య సమయంలో.. భారీ యాక్షన్ అండ్ హెవీ ఎమోషనల్ డ్రామా అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఎన్టీఆర్ 30ని భారీగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.