నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’.. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘బింబిసార’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ పాజిటివ్ టాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ కూడా బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడట. గతంలో బింబిసార మూవీని ముందే చూసి.. బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు యంగ్ టైగర్. చెప్పినట్టుగానే ‘బింబిసార’ కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అమిగోస్ మూవీని కూడా తారక్ ముందే చూసేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ కోసం అమిగోస్ స్పెషల్ స్క్రీనింగ్ వేశారట. కళ్యాణ్ రామ్‌తో పాటు చిత్ర యూనిట్‌తో కలిసి ‘అమిగోస్’ చిత్రాన్ని వీక్షించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చూసి చాలా బాగుందని టీమ్‌ని మెచ్చుకున్నాడట తారక్. ఎన్టీఆర్‌కు సెకండాఫ్ చాలా బాగా నచ్చిందట. దాంతో దర్శకుడు రాజేంద్ర రెడ్డి పనితీరుని ప్రత్యేకంగా అభినందించాడట. అలాగే కళ్యాణ్ రామ్ నటన పై ప్రశంసలు కురిపించాడట. మొత్తంగా ఊహించిన దానికంటే అమిగోస్ అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని చెప్పాడట. ఇక ఎన్టీఆర్ నుండి అమిగోస్‌కు పాజిటివ్ రివ్యూ రావడంతో.. చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోందట. మరి ఎన్టీఆర్ చెప్పినట్టుగా అమిగోస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.