NTR-Trivikram : 'అరవింద సమేత'లో స్టార్టింగ్‌లోనే గూస్ బంప్స్ తెప్పించి.. నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమా మొత్తానికి ఈ ఒక్క ఫైట్ చాలని అన్నారు. సినిమా కూడా హిట్ అయింది. దాంతో వెంటనే మరోసారి తారక్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అన్నారు.
‘అరవింద సమేత’లో స్టార్టింగ్‌లోనే గూస్ బంప్స్ తెప్పించి.. నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమా మొత్తానికి ఈ ఒక్క ఫైట్ చాలని అన్నారు. సినిమా కూడా హిట్ అయింది. దాంతో వెంటనే మరోసారి తారక్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అన్నారు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఎవరి దారి వారు చూసుకున్నారు. కొరటాల శివతో తారక్.. మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 సెట్స్ పై ఉండగా.. ఎన్టీఆర్ 30 షూటింగ్‌కు రెడీ అవుతోంది. దాంతో ఇక త్రివిక్రమ్, తారక్ కాంబోలో సినిమా లేనట్టేనని అనుకున్నారు. కానీ తాజాగా యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్‌తో ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు త్రివిక్రమ్ అటెంప్ట్ చేయని జోనర్లో ఈ సినిమా ఉంటుందని.. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించబోతున్నట్లు చెప్పాడు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు అయిపోయిన తర్వాత.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు గానీ.. పౌరాణికం అనే సరికి.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. మరి త్రివిక్రమ్ కొత్త జానర్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.