Jr.NTR : ఆచార్య సినిమాతో.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఘోర పరజయాన్ని అందుకున్నారు. అయితే ఆచార్య తర్వాత మెగాస్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. గాడ్ ఫాదర్‌తో సోసోగానే మెప్పించినా.. వాల్తేరు వీరయ్యతో మాత్రం బాక్సాఫీస్ బద్దలు చేశాడు. దాంతో ఆచార్య తర్వాత చిరు అదరొట్టేశాడనే చెప్పాలి.
ఆచార్య సినిమాతో.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఘోర పరజయాన్ని అందుకున్నారు. అయితే ఆచార్య తర్వాత మెగాస్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. గాడ్ ఫాదర్‌తో సోసోగానే మెప్పించినా.. వాల్తేరు వీరయ్యతో మాత్రం బాక్సాఫీస్ బద్దలు చేశాడు. దాంతో ఆచార్య తర్వాత చిరు అదరొట్టేశాడనే చెప్పాలి. అందుకే ఇప్పుడు కొరటాల శివ వంతు అంటున్నారు మూవీ లవర్స్. చిరు లాగే కొరటాల కూడా సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని అంటున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం దారుణమైన ఫ్లాప్ ఫేజ్ చేయడంతో.. కొరటాల కూడా కసి మీదున్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు. ఫైనల్‌గా ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు లాక్ చేశాడు. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్30 కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని సముద్రం బ్యాక్ డ్రాప్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే భారీ పోర్ట్ సెట్టింగ్ వేస్తున్నారు. అందుకే కీలక యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్‌ని రంగంలోకి దింపబోతున్నాడట. ఇప్పటికే ఆస్కార్ కోసం అమెరికాలో ల్యాండ్ అయిపోయాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ 30 కోసం కొందరు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో మీట్ అవనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.