»Not Just A Remake Ustad Bhagat Singh Is Also Ready
Pawan Kalyan : రీమేకే కాదు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రంగం సిద్ధం!
Pawan Kalyan : ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవనే లేదు.. కానీ పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవనే లేదు.. కానీ పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇటీవలె హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ సినిమాలు లాంచనంగా మొదలు పెట్టారు పవన్. కానీ అప్పుడెప్పుడో కొబ్బరికాయ కొట్టిన వినోదయ సీతమ్నే ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అలాంటప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజి పరిస్థితేంటనే టాక్ నడుస్తోంది. కానీ త్వరలోనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. తాజాగా షూటింగ్ షెడ్యూలు ప్లానింగ్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. హీరోయిన్గా పూజా హెగ్డేను కూడా ఫైనల్ చేసినట్టు టాక్. పైగా వినోదయ సీతమ్‌కు పవన్ 20 రోజులు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్.. కాబట్టి అతి త్వరలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ కూడా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత సుజీత్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. వీటితో పాటు హరిహర వీరమల్లు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమాలను కంప్లీట్ చేయడమే పవన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. మొత్తంగా.. ప్రస్తుతానికి అఫిషీయల్‌గా పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.