Sandeep Kishan : పాన్ ఇండియా ఫిల్మ్.. మూడు వారాల్లోనే ఓటిటిలోకి!
Sandeep Kishan : యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా గట్టిగా ట్రై చేశాడు. కానీ మనోడి ఆశలు ఆవిరైపోయాయి. థియేటర్ రిలీజ్ అయి మూడు వారాలు తిరగకముందే.. ఓటిటిలోకి వచ్చేస్తున్నాడంటే.. ఆ సినిమా ఉలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా గట్టిగా ట్రై చేశాడు. కానీ మనోడి ఆశలు ఆవిరైపోయాయి. థియేటర్ రిలీజ్ అయి మూడు వారాలు తిరగకముందే.. ఓటిటిలోకి వచ్చేస్తున్నాడంటే.. ఆ సినిమా ఉలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘మైఖేల్’. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా కష్టపడ్డాడు.. సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశాడు.. ఏకంగా 24 కిలోల వరకు బరువు కూడా తగ్గాడు. ట్రైలర్‌తో సినిమా పై ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. పైగా ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా నటించాడు. వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేశారు. కానీ డైరెక్టర్ రంజిత్ జయకోడి అనుకున్న స్థాయిలో మైఖేల్‌తో మెప్పించలేకపోయాడు. సినిమా మేకింగ్, టేకింగ్ బావున్నాయని పేరు వచ్చింది.. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది ‘మైఖేల్’. అయితే సినిమా టాక్ తేడా కొట్టడంతో.. మూడు వారాల్లోనే ఓటిటి బాట పట్టింది. మైఖేల్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘ఆహా’ ఓటీటీ సొంతం చేసుకుంది. దాంతో ఈ నెల 24 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా.. ‘రెడీగా ఉండండి.. పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మన మైఖేల్.. నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైనర్’ అని రాసుకొచ్చారు ఆహా వారు. మరి ఓటిటిలో అయినా మైఖేల్ ఆకట్టుకుంటాడేమో చూడాలి.