ఆహా అన్‌స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ షో అన్ని షోలకు అమ్మమొగుడిలా మారింది. ఈ వారంలో అంటే.. జనవరి 6న ప్రభాస్ బాహుబలి సెకండ్ పార్ట్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా టీమ్. ఇక ఆ తర్వాత వారం.. జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఎపిసోడ్‌ను వాయిదా వేశారు. జనవరి 13న స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు ఆహా వారు. దాంతో ఆ స్పెషల్ ఎపిసోడ్ ఏంటనే ఆసక్తి అందరిలోను మొదలైంది. బహుశా వీర సింహారెడ్డి చిత్ర యూనిట్‌తో స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రేసులోకి వాల్తేరు వీరయ్య కూడా వచ్చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ‘వీరసింహారెడ్డ’, మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’.. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు. అందుకే చిరు, బాలయ్యతో కలిపి ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి సెకండ్ సీజన్‌ను మెగాస్టార్‌తోనే స్టార్ట్ చేయబోతున్నారని వినిపించింది. కానీ అలా జరగలేదు. అయితే ఈ టైంలో మెగాస్టార్ అన్‌స్టాపబుల్‌కి వస్తే.. సినిమా ప్రమోషన్స్‌తో పాటే.. ఆహాకు మరింత హైప్ ఇస్తుంది. చిరంజీవి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అంతే కాదు ఈ ఐడియా కూడా మెగాస్టార్దేనని వినిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతికి వీరయ్య, వీరసింహారెడ్డి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని అంటున్నారు.