Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ ట్రైలర్ రిలీజ్
ఓ అందమైన పల్లెటూరులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు జీవిత కథాంశంతో వస్తోన్న సినిమా కృష్ణగాడు అంటే ఒక రేంజ్. కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఓ వైపు తన తండ్రి కోరికను నెరవేర్చడం, మరో వైపు ప్రేమను గెలవడం..ఇలాంటి సవాళ్ల మధ్య కృష్ణ పోరాట తీరును సినిమాలో చూపించారు.
`కృష్ణగాడు అంటే ఒక రేంజ్` సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆగస్టు 4వ తేదిన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. బుధవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కృష్ణగాడు అంటే ఒక రేంజ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా టీజర్, మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా ట్రైలర్ మూవీ అంచనాలను పెంచేసింది.
కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఓ వైపు యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఎమోషనల్ ఎలిమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.