Ram Charan : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత శంకర్‌తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత శంకర్‌తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, కన్నడ దర్శకుడు నర్తన్, ప్రశాంత్ నీల్‌తో పాటు సుకుమార్ కూడా చరణ్‌తో లైన్లో ఉన్నారు. అయితే వీళ్లకంటే ముందే ఉప్పెనతో హిట్ అందుకున్న బుచ్చిబాబు సానాతో.. ఆర్సీ 16 మూవీ చేయబోతున్నాడు చరణ్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సెకండ్ సినిమానే చరణ్‌తో ఛాన్స్ కొట్టేయడంతో.. పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడు బుచ్చిబాబు. అయితే.. రీసెంట్గా బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో కలుద్దామని చెప్పుకొచ్చాడు చరణ్. దాంతో ఈ సమ్మర్లోనే సినిమా ప్రారంభోత్సవం జరిపి.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ చేశాడట బుచ్చిబాబు. అలాగే లోకేషన్ల వేట కూడా జరుగుతోందట. దాంతో అనుకున్న దానికంటే ముందే ఆర్సీ 16 షూటింగ్ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే మరో వెర్షన్ ప్రకారం.. ఈ ఇయర్ ఎండింగ్లో షూటింగ్ ఉంటుందని అంటున్నారు. కానీ అప్పటి వరకు చరణ్, బుచ్చిబాబు వెయిట్ చేసేలా లేరు. మామూలుగానే ఓ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా స్టార్ట్ చేసేస్తాడు చరణ్. ఎలాగు ఆర్సీ 15 మేజర్ పార్ట్ అయిపోయింది కాబట్టి.. ఈ సమ్మర్లోనే ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి చరణ్‌తో బుచ్చిబాబు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడో చూడాలి.