Samantha vs Bichagadu : విజయ్ ఆంటోని అంటే.. గుర్తుపట్టడం కాస్త కష్టమే. అదే బిచ్చగాడు హీరో అంటే.. ఠక్కున పట్టేస్తారు తెలుగు జనాలు. అంతలా తెలుగులో విజయాన్ని అందుకుంది బిచ్చగాడు సినిమా. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది బిచ్చగాడు.
విజయ్ ఆంటోని అంటే.. గుర్తుపట్టడం కాస్త కష్టమే. అదే బిచ్చగాడు హీరో అంటే.. ఠక్కున పట్టేస్తారు తెలుగు జనాలు. అంతలా తెలుగులో విజయాన్ని అందుకుంది బిచ్చగాడు సినిమా. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది బిచ్చగాడు. దాంతో విజయ్ ఆంటోని నుంచి మరిన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ బిచ్చగాడు రేంజ్ అందుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు బిచ్చగాడు సీక్వెల్గా బిచ్చగాడు 2 రిలీజ్కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ స్నీక్ పీక్ వీడియో సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బిచ్చగాడు 2 పై ఉన్న అంచనాలకు.. మంచి ఓపెనింగ్స్ అందుకోవడం పక్కా. అని స్టార్ బ్యూటీ సమంత పోటీని బిచ్చగాడు ఎంతవరకు తట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. సమంత నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’.. పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 14న ఈ రెండు సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. మేజర్ పోటీ మాత్రం సమంత, విజయ్ మధ్యే ఉండనుంది. అయితే శాకుంతలం రేసులో ఉంది కాబట్టి.. బిచ్చగాడు సినిమాకు థియేటర్ల కొరత తప్పదు. కాబట్టి.. బిచ్చగాడు, సమంతతో సై అంటాడా.. లేక రిస్క్ ఎందుకని తప్పుకుంటాడో చూడాలి.