యాక్సిడెంట్ తర్వాత ‘బిచ్చగాడు’ హీరో ఫస్ట్ ట్వీట్ చేశాడు. హీరో విజయ్ ఆంటోని తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశాడు. ‘డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా నేను కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. కఠిన సమయాల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని విజయ్ ఆంటోని ట్వీట్ చేశారు.
థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ విజయ్ ఆంటోని తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పాడు. సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆ ఫొటో తీసినట్లుగా ఉంది. ప్రస్తుతం విజయ్ ఆంటోని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. విజయ్ కోలుకుంటున్నాడని తెలియడంతో అతని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.