Bichagaadu 2 Movie : కన్నీళ్లు పెట్టిస్తోన్న ‘బిచ్చగాడు 2’ సాంగ్
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా గతంలో బిచ్చగాడు సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్గా ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు2(Bichagaadu 2) మూవీ తెరకెక్కుతోంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా గతంలో బిచ్చగాడు సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ మూవీ ఘన విజయం అందుకుంది. ఆ మూవీకి సీక్వెల్గా ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు2(Bichagaadu 2) మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి గతంలో ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్(Song Release) అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్(Second Song)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
‘బిచ్చగాడు 2’ నుంచి ‘చెల్లి వినవే’ సాంగ్:
బిచ్చగాడు 2(Bichagadu 2) సినిమా నుంచి ‘చెల్లి వినవే..నా తల్లీ వినవే..నీ అన్నను కానూ అమ్మను నేను’ అంటూ సాగే ఈ పాట అందర్నీ కదిలిస్తోంది. ఈ పాటకు భాష్య శ్రీ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి(Anurag kulakarni) ఈ సాంగ్ ను పాడాడు. ఈ మూవీకి విజయ్ ఆంటోనీ(Vijay antony)నే మ్యూజిక్ అందించారు. అనాథలైన హీరో చిన్నతనంలో తన సోదరితో కలిసి అనుభవించిన కష్టాల నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఆ పాటలో ఆర్ధ్రతతో నిండిన సాహిత్యం కనిపిస్తుంది.
ఈ మూవీలో ఇదే హైలెట్ సాంగ్(Song) లాగే కనిపిస్తోంది. హృదయం బరువెక్కేలా ఈ సాంగ్ సాగుతుంది. విజయ్(Vijay antony) ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ పాట రిలీజ్(Song Release) అవ్వడంతో ఇంకాస్త అంచనా పెరిగిందని చెప్పాలి. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగానే కాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ అందిస్తున్నారు. తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.