Samantha : మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత స్టార్ బ్యూటీ సమంత.. ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టేసింది. రీసెంట్గా విజయ్ దేవరకొండ 'ఖుషి' షూటింగ్లోను జాయిన్ అయింది.
మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత స్టార్ బ్యూటీ సమంత.. ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టేసింది. రీసెంట్గా విజయ్ దేవరకొండ ‘ఖుషి’ షూటింగ్లోను జాయిన్ అయింది. ఇక ఇప్పుడు శాకుంతలం మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై.. శాకుంతలం మూవీ విజువల్ వండర్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వప్తోంది. ఫైనల్‌గా ఏప్రిల్ 14న శాకుంతలంను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. తాజాగా సమంత ఈ సినిమా చూసి.. రివ్యూ కూడా ఇచ్చింది. ‘ఫైనల్లీ.. ఈ రోజు ‘శాకుంతలం’ సినిమా చూశా.. చాలా అందంగా ఉంది.. ఇదొక దృశ్య కావ్యం.
గుణశేఖర్ నా హృదయాన్ని గెలుచుకున్నారు. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శకుంతల, దుష్యంత మహారాజు కథకు ఆయన ప్రాణం పోశారు. పవర్ ఫుల్ ఎమోషన్స్‌తో రూపొందిన చిత్రమిది. ఫ్యామిలి ఆడియెన్స్ ఇందులోని భావోద్వేగాలకు కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఎప్పుడెప్పుడు వారు ఈ సినిమా చూస్తారా అనిపిస్తోంది.. పిల్లలు కూడా ఈ మ్యాజికల్ వరల్డ్‌ను భలే లవ్ చేస్తారు. ఇటువంటి సినిమా ఇచ్చిన ‘దిల్’ రాజు, నీలిమా గుణలకు థాంక్స్.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సమంత. దాంతో సామ్ ఈ సినిమా పై ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి శాకుంతలం సమంతకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.