ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా, అటు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే రాజకీయంగా బండి ముందుకు నడవాలంటే.. బడ్జెట్ కావాలి. అందుకే పవర్ స్టార్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలు కంప్లీట్ చేసి.. ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కానీ అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవడం లేదు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లును క్రిష్ ఎంత స్పీడ్‌గా చేద్దామనుకున్నా.. డిలే అవుతునే ఉంది. ఈ సినిమా షూటింగ్లో పవన్ అడుగుపెట్టిన ప్రతిసారీ.. ఇక అయిపోయినట్టేనని అనుకుంటున్నారు. కానీ ఓ షెడ్యూల్ అయిపోగానే.. పొలిటికల్ బ్రేక్ పడుతునే ఉంది. అసలు ఇప్పట్లో ఈ సినిమా పూర్తవుతుందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు సీక్వెల్ హైప్ మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. హరిహర వీరమల్లుని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లుగా నిర్మాత ఏఏం రత్నం.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాంతో ఒకటే కంప్లీట్ అవడం లేదు.. కానీ ఇంకోటి సాధ్యమేనా.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే కాదు పవన్-సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఓజి కూడా రెండు భాగాలని ప్రచారం జరుగుతోంది. అయితే హరిహర వీరమల్లు అయినా కొంత షూటింగ్ జరుపుకుంది.. కానీ ఓజి ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే.. సెకండ్ పార్ట్ అంటే కష్టమే అంటున్నారు. కాబట్టి ముందు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయండి.. ఆ తర్వాత సీక్వెల్ గురించి ఆలోచిద్దామని అంటున్నారు నెటిజన్స్. అయితే.. ఒకవేళ పవన్ నుంచి సీక్వెల్స్ వస్తే మాత్రం.. బాక్సాఫీస్ దాన్ని తట్టుకోవడం కష్టమే. అయినా ఈ మధ్య సీక్వెల్స్ ప్రచారం కామన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడే ఏది నిజమని తేల్చలేం.